ఓమిక్రాన్ వచ్చినా సిద్ధమే: నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ ప్రజలకు డీహెచ్ శ్రీనివాసరావు సూచన

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో గుర్తించబడిన కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు(డీహెచ్) డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై ప్రభుత్వ సన్నద్ధతపై రెండు గంటలపాటు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ డీహెచ్ శ్రీనివాసరావు ఈ సమావేశం అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నియంతరణకు ఆరోగ్యశాఖ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తున్నామని, రాష్ట్రంలో కేసుల పెరుగుదల నిలకడగానే ఉందని తెలిపారు.

ఇప్పటికైతే దేశంలోకి ఓమిక్రాన్ రాలేదు ఇప్పటి వరకు దేశంలో దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు. కొత్త వేరియంట్ దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ జరుగుతోందని, అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారన్నారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్ ఉండేలా చర్యలు తీసుకుని వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ఐదు నెలల నుంచి రాష్ట్రంలో 200 లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు, 45 శాతం రెండో డోసు ఇచ్చామని తెలిపారు. వ్యవధి గడిచినా కూడా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదని చెప్పారు.

ఆందోళనవద్దు.. జాగ్రత్తలు పాటించాల్సిందే.. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో కొంత నిర్లక్ష్యంగా ప్రజలు వ్యవహరించడాన్ని గమనించామని తెలిపారు. ఏ వేరియంట్ అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రంగా చేతులను ఉంచుకోవడం లాంటివి మర్చిపోవద్దని సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసువాలన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. ప్రజలు కొత్త వేరియంట్ పట్ల ఆందోళన చెందకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, దక్షిణాఫ్రికాలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ కూడా దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త వేరియంట్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంతి హరీష్‌రావు వైద్యాశాఖ ఉన్నతాధికారులతో ఈ రోజు రెండు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది